
విజయనగరం, ఫిబ్రవరి 20, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పరిపాలనపై విశ్వాసంతో వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి చేరికలు కొనసాగుతున్నాయి. డెంకాడ మండలం పేడాడ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ మెండి జగదీశ్వరరావు, వైస్ సర్పంచ్ మెండి సురేష్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకుడు లోకం ప్రసాద్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డెంకాడ మండల కోఆర్డినేటర్ పైల శంకర్, క్లస్టర్ అబ్సర్వర్ దాడిశెట్టి శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ సిమ్మల చిరంజీవి పాల్గొన్నారు. కొత్తగా చేరిన నాయకులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మరియు ఎమ్మెల్యే మాధవి చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జనసేన బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.








