
పిఠాపురం, జనవరి 5, (జనస్వరం) : పిఠాపురం ఆర్ఆర్బి హెచ్ఆర్ గ్రౌండ్స్‌లో మంగళవారం జనస్వరం 2026 నూతన క్యాలెండర్‌ను డీసీసీబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిఠాపురం జనసేన నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. ప్రముఖ మీడియా పత్రిక రంగంలో ప్రజల మాటలను ప్రజాప్రతినిధులకు చేరవేసే విధంగా ముందుండి ప్రజావారధిగా పేరుగాంచిన “జనస్వరం – అక్షరమే ఆయుధం” పత్రిక క్యాలెండర్‌ను ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ “జనసైనికులే నా మీడియా” అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని జనసైనికుడు సాకే నరేష్ జనస్వరం న్యూస్‌ను స్థాపించారని తెలిపారు. జనస్వరం న్యూస్ చేస్తున్న సేవలను పవన్ కళ్యాణ్ గుర్తించి గతంలో సాకే నరేష్‌ను అభినందించారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో జనస్వరం ముందుంటోందని ప్రశంసించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఒకే క్యాలెండర్‌లో ప్రచురించడం అభినందనీయమని తెలిపారు. నేటి సమాజంలో అనేక పత్రికలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రతి పత్రిక యాజమాన్యం ప్రజల గొంతును ప్రజాప్రతినిధులకు చేరవేసే విధంగా నిజాయితీతో, పద్ధతిగా వార్తలు ప్రచురించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, బీసీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ వూట నానిబాబు, గంజి గోవిందరాజు, చెల్లుబోయిన సతీష్, సురవరపు సురేష్, మేళం రామకృష్ణ, కర్ణం సూరిబాబు, బసవ చిట్టిబాబు, మామిడాల సూరిబాబు, రామిశెట్టి సూరిబాబు, దేవదాస్, బి.ఎన్.రాజు, కొండేపూడి శివ, చెల్లుబోయిన నాగేశ్వరరావు, బేరా రవి, సుంకర నరేంద్ర, నామ శ్రీకాంత్‌తో పాటు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.








