రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: జనసేన జిల్లా అధ్యక్షులు రామస్వామి

పిఠాపురం, జనవరి 02, (జనస్వరం) : రైతుల కష్టాలు తెలుసుకుని వారికి నిరంతరం అండగా నిలిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని డిసిసిబి చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. శుక్రవారం పిఠాపురం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ముద్రించడం, సర్వే రాళ్లపై కూడా జగన్ బొమ్మ వేయడం జరిగిందని విమర్శించారు. రైతుల భూములను తమ సొంత భూములుగా మార్చుకునే ప్రయత్నాలు చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రైతుల భూములు దోచుకునే విధంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోను తొలగించి, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం ప్రారంభించడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఇది రైతులపై ప్రభుత్వానికి ఉన్న నిజమైన గౌరవానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ, పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, ఏలేరు డెల్టా వైస్ చైర్మన్ వూట ఆదివిష్ణు నాని బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు చల్లా లక్ష్మి, పెంకే జగదీష్, సూరిశెట్టి జయకృష్ణ, కంచర్ల భవాని శంకర్, మొగలి అప్పారావు, దానం లాజర్ బాబు, నక్క నారాయణమూర్తి పాల్గొన్నారు. అలాగే పిఠాపురం జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, చెల్లుబోయిన సతీష్, బొజ్జ లోవరాజు, మార్నిడి రంగబాబు, కొత్తమ్ సుందర్, బి.ఎన్. రాజు, వెన్న చంద్రరావు, మొయిల్లా నాగబాబు, మచ్చ అప్పాజీ, అల్లం కిషోర్, నక్క బద్రి, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

See also  జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన సహానకు చేయూత