
ఫోర్జరీ దస్తావేజులు సృష్టించి స్థలం కబ్జాకు యత్నం.
చనిపోయిన వ్యక్తికి రెండు మరణ ధృవీకరణ పత్రాలు, 1994 లో ఒకసారి 1996 లో మరోసారి ఇది ఎలా సాధ్యం.
నరసరావుపేట డిసెంబర్ 29 (జనస్వరం).
పట్టణంలోని యన్.జి.ఓ. కాలనీలో నివాసముంటున్న (1) మాగం విజయలక్ష్మి Wo పుల్లారావు (2) గాలి నాగేశ్వరరావు S/o బ్రహ్మయ్య (3) వందనపు కృష్ణపుల్లారావు S/o వెంకటప్పయ్య (4) కనుమూరి శ్రీనివాసరావు S/o కోటయ్య (5) కనుమూరి మోహన్రావు S/o కోటయ్య (6) సూరపనేని పద్మావతి W/o శ్రీనివాసరావు (7) గార్లపాటి రామకోటేశ్వరరావు S/o సీతారామయ్య (8) వందనపు కోటిరత్నం W/O కోటిసూర్యప్రకాశరావు, ల స్థలాలను కాజేయాలని చూస్తున్నారు . యన్.జి.ఓ. కాలనీలోని 1వ లైన్లో షేక్ గాలిబ్ సాహెబ్ S/o కాసుమల్లిసాహెబ్ కి స్వార్జితముగా నెం. 4793/74 గా య.0.41 2/3 సెంట్లు స్థలమును కొనుగోలు చేసినారు. ఆ తదుపరి షేక్ గాలిబ్ సాహెబ్ తన కుటుంబ అవసరాల నిమిత్తము తన స్వార్జితమైన భూమిని 1981 జనవరిలో 5గురికి, సెప్టెంబర్ నెలలో ఒకరికి, తనకున్న య.0.41% సెంట్లు స్థలమును వేరు వేరు దస్తావేజులుగా ఇతరులకు విక్రయించినారు. ఆ విధముగా రెండుచేతులు మారిన తరువాత మేము షేక్ గాలిబ్ సాహెబ్ వద్ద కొనుగోలు చేసిన వారిలో ఒకరైన మీరావలి వద్ద మరియు కేతు వెంకట సుబ్బారెడ్డి వద్ద మరియు సయ్యద్ ఖాసింపీరా, సయ్యద్ ఇస్మాయిల్ వద్ద మేమందరము తలా కొంత భూమిని ఇండ్ల స్థలముల కొరకు కొనుగోలు చేసినాము. అనగా సుమారు 51 సం॥ల నుండి సదరు భూమి గాలిబ్ సాహెబ్ వద్ద నుండి విక్రయించబడి అప్పటి నుండి మా స్వాధీనానుభవములలో ఉంటూ మేము అనుభవించుచున్నాము. మాలో కొంత మంది ఇండ్లు కూడా కట్టుకొని నివసిస్తున్నారు
అయితే గత 51సం||ల క్రితము విక్రయించబడిన గాలిబ్సాహెబ్ కుమారుడు షేక్ నాసర్ వలి, అతని కుమార్తెలు అందరూ కలసి వారి తండ్రి మాకు విక్రయించిన భూమిని మరలా వారిలో వారే ఒక సోదరికి (షేక్ చాంద్గారి భార్య షేక్ లాలబి) జనరల్ పవరాఫ్ అటార్నీ వ్రాసి ఇచ్చినారు.
వారు సృష్టించిన పోర్జరీ దస్తావేజులు
1) షేక్ గాలిబ్ సాహెబ్ ది. 10-08-1994న మరణించినట్లు ఒక మరణధృవీకరణ పత్రము మరియు 10-08-1996న మరణించినట్లు మరొక మరణ ధృవీకరణ పత్రము ఈవిధంగా నరసరావుపేట మున్సిపాలిటీ వారిని మభ్యపెట్టి ఒకే వ్యక్తి రెండు తేదీలలో మరణించినట్లు రెండు మరణ ధృవీకరణ పత్రములు పొంది, వారు వేరు వేరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో పొందుపరచినారు. 2. సదరు రెండు మరణ ధృవీకరణ పత్రములు అవసరమైన చోట అవసరమైన తేదీలను వారికి అనుగుణంగా ఉపయోగించుకుంటూ వారిలో వారే మాకు విక్రయించిన భూమిని భాగపంపిణీ రిజిష్టర్ దస్తావేజులు ఒకసారి మరొకసారి వేరే వారి పేరుపై జనరల్ పవరాఫ్ అటార్నీ వ్రాసి, మరలా వారే జనరల్ పవరాఫ్ అటార్నీ రద్దు చేసుకున్నారు. 3) మరలా కొత్తగా పవరాఫ్ అటార్నీ సృష్టించి, వారిచే వివిధ వ్యక్తులకు రిజిష్టర్ దస్తావేజులు సృష్టించినారు. 4) నరసరావుపేటలో మా అందరి స్వాధీనములో ఉన్న ఆస్టిని మాకు తెలియకుండా ఫేక్ దస్తావేజులతో మాచర్లలో కాకాని శ్రీలక్ష్మికి, కాటేవల్లి అనూరాధ, చిన్నం చిరంజీవి అను వారికి రిజిష్టర్లు జరిపినారు. 5) షేక్ గాలిబ్ సాహెబ్ జీవించియుండగా, మాకు విక్రయించిన భూమిని, వారి సంతానము నరసరావుపేట కోర్టు వారికి నిల్వ భూమికి పాత దస్తావేజులను చూపించి, వారిలో వారే పార్టీషన్ దావా వేసుకొని వారు చూపిన పాత కాగితాల ద్వారా భాగపంపిణీ చేసుకున్నారు.అందులో కూడా 1996 మరణ ధృవీకరణ పత్రము పొందుపరచినారు. ఈ విధంగా కోర్టు వారిని కూడా మోసగించినారు. తరువాత గాలీబ్ సాహెబ్ వారసులు అందరూ కలసి లాల్బి కి పవరాఫ్ అటార్నీ రాశారు. అందులో మరణధృవీకరణ పత్రము 1994లో మరణించినట్లు ఫేక్ సర్టిఫికెట్ను పొందుపరచినారు.

ఇప్పుడు మా ఇండ్లవద్దకు, మా స్థలముల వద్దకు వచ్చి గత 50సం||ల నుండి మా స్వాధీనములో యుండి మున్సిపల్ టాక్స్, వాటర్ టాక్స్, కరెంటు మీటర్లు కలిగియున్న మా ఇండ్లు కలిగిన స్థలాలను ఖాళీ చేయమని మమ్ములను కాకాని శ్రీలక్ష్మి, కాటేపల్లి అనూరాధ, చిన్నం చిరంజీవి, మరియు నరసరావుపేట లోకల్ గా గాలిబ్ సాహెబ్ వారసులు షేక్ నాసర్వలి, షేక్ నాసూర్, షేక్ నజీరున్, పఠాన్ గుల్జార్బగం, షేక్ లాలి ్బ, గాలిబ్ సాహెబ్ అల్లుడు నాసర్ వలి మరికొంతమంది వారి అనుచరులతో మా ఇండ్లపై పడి మమ్ములను భయభ్రాంతులకు గురి చేయుచున్నారు. మేమందరమూ సీనియర్ సిటిజన్స్ అయి ఉన్నాము. మా వయస్సులో సుమారు 60 నుండి 85 సం॥ల మధ్యలో ఉన్నవి. ఈ మధ్యకాలంలో పై వారందరూ మా ఇళ్ళ మీదకు,మా స్థలము లోనికి వారి మనుషులతో వచ్చి మాపై దాడి చేసి, మమ్ములను భయభ్రాంతులకు గురి చేసి, మాకు ప్రాణ హాని తలపెట్టుటకు ప్రయత్నించినారు. మేము గుండె జబ్బులతో మరియు బైపాస్ సర్జరీలు జరిగి యున్నాము. పై వారి వలన మాకు ప్రాణ హాని ఉన్నది. ఏ క్షణంలో మరలా మా ఆస్థిమీదకు, స్థలాల మీదకు వచ్చి ప్రాణహాని తలపెడతారోనని భయముగా ఉన్నది. వారు చేసిన చర్యలు, భయభ్రాంతుల తాలూకు విడియోలు, ఫోటోలు కూడా మా వద్ద కలవు కావున తమరు మా యందు దయవుంచి పై విధంగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించిన పై వారందరిని పిలిపించి, విచారించి, వారు మా జోలికి, మా ఆస్తుల జోలికి, ఇళ్ళ జోలికి రాకుండా తగు చర్య తీసుకొని వారు సృష్టించిన ఫేక్ డాక్యుమెంట్స్ పై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగు క్రిమినల్ చర్యలు తీసుకొని వారిని బైండోవర్ చేసి, మాకు న్యాయము చేయవలసినదిగా జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ను కలసి ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో వారి సమస్యను వివరించి మాకు న్యాయం చేయవలసిందిగా గా కోరారు.








