
పలాస నియోజకవర్గం జనసేన నాయకురాలు పండా సుజాత యాదవ్ గారి ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమ్మేళనం
పలాస నియోజకవర్గం జనసేన నాయకురాలు మరియు ఆంధ్రప్రదేశ్ జనసేన అధికార ప్రతినిధి పండా సుజాత యాదవ్ గారి ఆధ్వర్యంలో మందస మండలం హరిపురం గ్రామంలో పలాస నియోజకవర్గం జనసైనికులు కలిసి పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వాహకులు పండా సుజాత యాదవ్ గారు అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా హరిపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సుజాత యాదవ్ గారు మాట్లాడుతూ జనసేన పలాస నియోజకవర్గం లో కొత్తతరం నాయకులును తయారు చేస్తుందని, జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పంచాయతీ నుండి MPTC అభ్యర్థిని, ప్రెసిడెంట్ అభ్యర్థిని నిలబెడతాం అని, పలాస నియోజకవర్గంలో ఏ జనసైనికుడికి కష్టం వచ్చిన వారికీ సపోర్టివ్ గా ఉంటామని మరియు పలాస నియోజకవర్గంలో జనసేన అభివృద్ధి కి జనసైనికులు అందరూ కలిసి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన MPTC అభ్యర్థులు, ప్రెసిడెంట్ అభ్యర్థులు జనసేన నాయకులు, పలాస మండలం, వజ్రపుకొత్తూరు మండలం, మందస మండలం జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.








