విజయవంతంగా బి బి ఏ విద్యార్థులకు జరిగిన ఇంటిగ్రేటెడ్ కంపెనీ అధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్

విజయవంతంగా జరిగిన ఇంటిగ్రేటెడ్ కంపెనీ అధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్.

నరసరావుపేట,డిసెంబర్18.
( జనస్వరం)

నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం బి.కామ్ మరియు బి.బి.ఏ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించ బడింది.ఈ క్యాంపస్ డ్రైవ్‌లో భాగంగా ముందుగా వ్రాత పరీక్ష, అనంతరం హెచ్‌ఆర్ వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించగా, ఈ ఎంపిక ప్రక్రియను కంపెనీకి చెందిన హెచ్‌ఆర్‌లు బాలాజీ, కీర్తన, విజయలక్ష్మి పర్యవేక్షించారు.మొత్తం 150 మంది విద్యార్థులు ఈ డ్రైవ్‌లో పాల్గొనగా అందులో 44 మంది విద్యార్థులు తుది ఎంపికకు అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులకు రూ.1.80 లక్షల వార్షిక వేతనం (LPA)తో రిలేషన్‌షిప్ మేనేజర్ ఉద్యోగ బాధ్యతలు కేటాయించబడతాయి.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు,డైరెక్టర్ కె. నాసరయ్య,ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ బాల కోటేశ్వరరావు ఎంపికైన విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

See also  సైన్స్ డే సందర్భంగా తొమ్మిది బహుమతులు సాధించిన కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లి విద్యార్థులు