నివార్ బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని బనగానపల్లే జనసేన పార్టీ నాయకుల నిరాహార దీక్ష

నివార్ బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని బనగానపల్లే జనసేన పార్టీ నాయకుల నిరాహార దీక్ష

                   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీవర్ తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి వెంటనే తక్షణ సాయం కింద పదివేల రూపాయలు నష్టపరిహారం అలాగే పూర్తి సాయంగా 30 వేల రూపాయల ఎకరాకు చెల్లించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నిరాహార దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా బనగానపల్లె నియోజకవర్గం లోని కోవెలకుంట్ల మండల తాహశిల్దారు కార్యాలయాల సమీపంలో ఉదయం 10 నుండి 5 గంటల వరకు నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షను ఉద్దేశించి జనసేన పార్టీ కోవెలకుంట్ల నాయకులు పత్తి సురేష్ మాట్లాడుతూ రైతులకు న్యాయం చేస్తున్నామని రైతులు మా ప్రభుత్వంలో పండగ చేసుకుంటున్నారు అని చెబుతున్న ప్రభుత్వం నివారు తుఫానుతో తీవ్రంగా నష్ట పోతే తక్షణ సహాయం కింద ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వైయస్సార్ ప్రభుత్వానికి రైతులకు పరిహారం చెల్లించడానికి రెండు రోజుల సమయాన్ని ఇచ్చారని అయితే వైఎస్సార్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టిందని అన్నారు. అలాగే రాష్ట్రంలో రైతుల తరపున శాంతియుతంగా నిరాహార దీక్షలు చేపడుతున్న జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి కేసులు పెట్టడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అలాగే అరెస్టు చేసిన జనసేన నాయకులు కార్యకర్తలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.బిజెపి నాయకులు ఎం వి సుబ్బయ్య,కుందు పోరాట సమితి కన్వీనర్ కామిని వేణుగోపాల్ రెడ్డి, విహెచ్ పి ప్రఖండ కార్యనిర్వహక గడ్డం అమర్నాథ్ రెడ్డి,సమారత సేవ సమితి కన్వీనర్ రవి ,ధర్మ ప్రచారక్ వెంకటసుబ్బయ్య లు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో గురప్ప, బోదనం ఓబులేసు, నాగ ప్రసాద్, కిట్టు , నాగేంద్ర, పృద్వి, మహబూబ్ బాషా, నరసింహ, హర్ష, సాంబ, లోకేష్ పాల్గొన్నారు.

See also  మూలపేట సమస్యలు తీర్చండి : టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్