
క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
క్రోసూరు.డిసెంబర్16.( జనస్వరం)
క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్సీ సిబ్బంది ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సందేశాన్ని లూథరన్ చర్చి పాస్టర్ సుందరరావు క్రిస్మస్ సందేశం అందించారు. ప్రపంచ మానవాళికి క్రీస్తు బోధనలు అనుసరణీయమని శాంతి, కరుణ, ప్రేమ, దయ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం క్రీస్తు బోధనల సారాంశమని ఆయన పేర్కొన్నారు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి యున్నాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని శుభవార్తను ప్రకటిస్తూ సువార్త యొక్క మర్మాన్ని వివరించారు.ముందుగా వైద్యాధికారులు జాఫ్రీన్, మహమ్మద్ షాద్, సిరి చందనలు కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి నిర్వహించిన ఆటలు పోటీల్లో గెలుపొందిన వారికి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పబ్లిక్ హెల్త్ నర్స్ గా ఉద్యోగం చేస్తూ ఇటీవల మరణించిన కీర్తిశేషులు కూచిపూడి ప్రభావతి జ్ఞాపకార్థం వారి భర్త ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ వితంతువులైన మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేశారు. వైద్య అధికారులు మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యానికి ఆటలు పోటీలు ఎంతో దోహద పడతాయి అన్నారు. ఇటువంటి పోటీలో పాల్గొనడం ద్వారా పని ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఇటువంటి పోటీలు నిర్వహించిన శిఖా శాంసన్ ను వారు అభినందించారు.

ఈ సందర్భంగా శిఖా శాంసన్ ను సిబ్బంది శాలువాతో, పూలదండతో బొకేతో జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో లావణ్య, ప్రేమ రాజు, స్వప్న, ప్రహ్లాద్, శివుడు, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందరూ పాల్గొన్నారు.








