
మంగళగిరిలో జనసేన రైతు దీక్ష : శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు
నివర్ తుఫాను వలన పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మంగళగిరి పట్టణంలో గల బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద రైతు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం రూ.10000 సాయం అందించాలని, నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు రూ.35000 ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈ దీక్షా శిబిరం లొ కాజ, ఇప్పటం, గుండిమెడ గ్రామ రైతులు పాల్గొని జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు జిల్లా చిరంజీవి యువత కమిటీ అధ్యక్షులు తన్నీరు కిషోర్ ఉపాధ్యక్షులు కంకణాల శంకర్, అమ్మిశెట్టి హరికృష్ణ,తేజ దీక్షా శిబిరంలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు, రేపల్లె జనసేన నాయకులు మత్తి భాస్కర్ గారు మరియు వారి మిత్రబృందం దీక్షా శిబిరంలో పాల్గొని మద్దతు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి శివ నాగేంద్రం, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతి రావు, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు మొలబంటి విజయ్ కుమార్ తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు సామల నాగేశ్వరావు, తిరుమల శెట్టి శ్రీధర్,మంగళగిరి మండలం ఉపాధ్యక్షులు రావి రమా మంగళగిరి మండల అధికారి ప్రతినిధి బేతపూడి విజయశేఖర్, దుగ్గిరాల మండలం కార్యనిర్వాహక కార్యదర్శి వినోద్ కుమార్, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి వకుల దేవి, వీర మహిళ బడే కోమలి, మంగళగిరి మండల ప్రచార కార్యదర్శి పవన్ కుమార్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి మోహన్ ,మరియు జనసేన నాయకులు చిట్టెం అవినాష్ ,నవీన్ కుమార్, వజీర్ భాష, నరేంద్ర, మరియు నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు..








