సౌదీ అరేబియా జనసేన పార్టీ తరుపున స్కూల్ బ్యాగ్స్ & నోట్ బుక్స్ పంపిణీ

హైదరాబాద్, అక్టోబర్ 11, (జనస్వరం) : ఉస్మానియా యూనివర్సిటీ పరిసరంలోని అంబర్ పేట్ ప్రాంతంలో ఉన్న నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ చేస్తూ జనసేన కార్యకర్తలు సేవా స్పూర్తిని మరలా చూపించారు. సౌదీ అరేబియా సెంట్రల్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ గురు కిరణ్ ఆధ్వర్యంలో, ఆ పార్టీ సభ్యుడు లొల్లా శర్మ దాతృత్వంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జనసేన రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్, వీర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ రత్నా పిల్లా చేతుల మీదుగా విద్యార్థులకు పాఠశాల సామగ్రి అందించారు.

అక్కడి పిల్లల అవసరాన్ని గుర్తించిన జనసేన కార్యకర్త అఫ్సర్, ఈ విషయాన్ని సౌదీ JSP కన్వీనర్ అమీర్ ఖాన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కమిటీతో చర్చించి ఆ బాధ్యతను ప్రెసిడెంట్ మురారికి అప్పగించారు. అనంతరం కోర్ కమిటీ సభ్యులు ఉషా, రమ్య, చేతన, యాకూబ్ ఖాన్, ఎర్రన్న, ఆనంద రాజు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ మావయ్య బ్యాగులు పంపాడని పిల్లలు ఆనందంగా కేరింతలు కొడుతుండగా అక్కడి ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం ప్రజావసరాలను పరిష్కరించడంలో విఫలమవుతుందని సంపత్ నాయక్ మండిపడ్డారు. కరోనా సమయంలో టీం సైనిక చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు.

వీర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ రత్నా పిల్లా మాట్లాడుతూ సౌదీ JSP టీం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. బ్లూ కలర్ ఉద్యోగుల్లో 200 మందికి ఇన్సూరెన్స్ చేయించడం, ఉద్యోగం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఏలూరు జిల్లాకు చెందిన మహిళకు లీగల్ సహాయం, ఫ్లైట్ టికెట్ ఏర్పాటు వంటి సేవలను ఆమె వివరించారు. స్పాన్సర్ లొల్లా శర్మ తమ వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకోవడం ప్రత్యేకమని అమీర్ ఖాన్, మురారి, గురు కిరణ్ అభినందించారు. గల్ఫ్ జాతీయ కన్వీనర్లు కేసరి త్రిమూర్తులు, చందక రామ్ దాస్, కంచన శ్రీకాంత్, రాయుడు మరిన్ని మంచి కార్యక్రమాలతో గల్ఫ్ ప్రాంతంలో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంపత్ నాయక్, గురు కిరణ్, అఫ్సర్, చాంద్, అశోక్, రత్నా పిల్లా, అరుణ కుమారి, పద్మజా తదితరులు పాల్గొన్నారు.

See also  కిలిమంజారో పర్వతం అధరోహించి జనసేన జెండా ఎగురవేసిన జనసేన నాయకులు శ్రీ డి. మల్లికార్జున రావు