
నెల్లిమర్ల, నవంబర్ 5, (జనస్వరం): MGNREGS పనుల పురోగతిపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి (DFO), MPDOలు, APOలు మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, 2ఉపాధి సదుపాయాల కల్పనలో MGNREGS కీలక పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుత పనుల పురోగతిని సమీక్షించి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ప్రణాళికను రూపొందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. “చర్చలు చాలాయి, ఇప్పుడు కార్యరూపం దిద్దే సమయం వచ్చింది,” అని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. అన్ని పనులు సమయానికి పూర్తవ్వడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ, వేతనాల చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకోవాలని ఆమె సూచించారు. అధికారులు బ్లాక్-వారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వారానికోసారి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఈ పథకం గ్రామీణ ప్రజల జీవనోపాధి అభివృద్ధికి మేలుచేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే హితవు పలికారు.








