డంపింగ్‌యార్డును తరలించాల్సిందే

    పాలకొండ ( జనస్వరం ) : నగర పంచాయతీ 20వ వార్డు పరిధి తెలుకవాని చెరువు గట్టుపై తాత్కాళికం పేరుతో ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డును తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం మూడు వార్డు ప్రజలు ర్యాలీగా నగర పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు గంటా సంతోష్, సిఐటియు నాయకులు దావల రమణ, బిజెపి పట్టణ అధ్యక్షులు, కారేపు చిట్టిబాబు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

See also  పాఠశాలల విలీనం పలుచోట్ల విద్యార్థులను కష్టాల పాలు చేస్తోంది : దారం అనిత