కొండపేట గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరించిన లోకం మాధవి

   నెల్లిమర్ల ( జనస్వరం ) :  కొండపేట గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జ్ లోకం మాధవి ఆధ్వర్యంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గ్రామ ప్రజల సమక్షంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే విధంగా లోకం మాధవి ఇంటింటికి తిరుగుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు గాజు గ్లాసు పై వేసి జనసేన టిడిపి ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని కోరడం జరిగింది. గ్రామంలో సమస్యలు గురించి మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడ చూసిన త్రాగునీరు కోరడం ఉందని వీధి దీపాలు మరియు కాలువలు సరైన స్థితిలో లేవని, సంక్షేమ పథకాలు ఉన్నవారికి ఇచ్చి లేని వారికి ఇవ్వడం లేదని అన్నారు. కనీసం ఈ వైసిపి ప్రభుత్వం అధికారులు కానీ నాయకులు గాని అసలేమీ పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోయారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వ రాగానే నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య ఉండదని ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి వచ్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామ ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మండల సీనియర్ నాయకులు మరియు గ్రామ ప్రజలు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  బటన్ ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు కష్టాలపాలు : విజయనగరం జనసేన నాయకులు