తాడేపల్లిగూడెం జనసేన పార్టీలోకి చేరికలు

    తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : ప్రత్తిపాడు గ్రామం బి.సి సామాజికవర్గం నుంచి జగత్ సోమశేఖర్(పండు) గారి ఆధ్వర్యంలో జనసేన సిద్ధాంతాలుకి ఆకర్షితులైనారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  బొలిశెట్టి శ్రీనివాస్  నాయకత్వంపై నమ్మకంతో శ్రీనివాస్ చేతుల మీదగా 50 మందికి పైగా జనసేన కండువాలు వేయించుకున్నారు. అనంతరం తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడు గ్రామం కాలవ గట్టు శివారులో ఒక తాటాకు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిందనీ ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  బొలిశెట్టి శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడు యొక్క వివరాలు తెలుసుకుని వెంటనే ఆ కుటుంబానికి పదివేల రూపాయలు మరియు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండలం అధ్యక్షులు పుల్లా బాబి, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు చెరుకూరి జగత్ సోమా శేఖర్ (పండు), అత్తిలి బాబి మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  వైసీపీపార్టీ వర్గాల దాడిలో గాయపడిన దళితులను పరామర్శించిన ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు