
కదిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం
ఈరోజు కదిరి నియోజకవర్గం లోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభించడం జరిగింది. మొదటి సభ్యత్వం పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ చేతులమీదుగా పట్టణ అధ్యక్షులు చలపతి గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కు ఐదు లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ అలాగే ఏదైనా ఉపద్రవం సంభవించిన ఎడల వారికి తక్షణ సాయంగా పార్టీ కార్యాలయం నుంచి 50 వేల రూపాయలు మొత్తాన్ని అందించడం జరుగుతుంది. అలాగే క్రియాశీల కార్యకర్తలకు ప్రత్యేకంగా పార్టీ కార్యాలయంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులు కూడా చూడడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనురాధ, కిన్నెర మహేష్, లక్ష్మణ్, లోకేష్, వంశీ, నాగేంద్ర, క్రిష్ణమ్మ, గణేష్, శీన తదితరులు పాల్గొన్నారు.









