రా కదలిరా… సభను విజయవంతం చేయాలని కోరిన జనసేన నాయకులు

    బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి రాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న రా.. కదలి రా.. సభక నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో, జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.  జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం ఇన్చార్జి మర్రాపు సురేష్ గారు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, జగన్‌ పాలనతో జనమంతా విసిగిపోయారని, ప్రజా పాలన రావాలని గట్టిగా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు.

See also  జనసేనాని స్పూర్తితో సెప్టెంబర్ 17 వ తేదీ భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన షేక్ హాలీ మా బి