శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 1,500 మందితో జనసేన బూత్ కమీటీ సభ్యులు సిద్దం

   శ్రీకాళహస్తి ( జనస్వరం ) : నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలో నియోజకవర్గ పరిధిలోని మండల, పట్టణ, బూత్ కమిటీ సభ్యులు 1,500 మందితో రోటరీ క్లబ్ నందు సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అని దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి 50 ఓట్ల కి ఒక జనసేన వాలంటీర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో పంచాయతీ స్థాయిలో 10 మంది తో కూడిన పంచాయతీ కోఆర్డినేటర్ల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రానున్న 2 నెలలు ప్రతి జనసైనికుడు అహర్నిశలు కష్టపడాలని, చివరి ఓటర్ కూడా మిస్ అవ్వకుండా బూత్ లో ఓటు వేసే విధంగా ఒక టీం స్పిరిట్ తో సమన్వయంతో పని చెయ్యాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అందించే దిశగా జనసేన పార్టీ నిలబడ్డ ప్రతి దగ్గర అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలవాలని కోరుకున్నారు.

See also  జి.మాడుగులలో జనసైనికుల ఆత్మీయ సమావేశం