పుట్టపర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాలు ఏర్పాటు

   పుట్టపర్తి ( జనస్వరం ) : అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనసేన కార్యాలయాలు ప్రారంభించగా ఆదివారం పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓడిసి, ఆమడుగూరు రెండు మండలాలో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్  టి.సి.వరుణ్, జిల్లా ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి, అంకె ఈశ్వరయ్య, తాడిపత్రి నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. యువతలో పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి పట్ల అమితమైన విశ్వాసం కలిగి ఉన్నారని.. ఈ నేపథ్యంలో పార్టీ విధి విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసైనికులుగా మనమందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. జనసేన పార్టీని బూత్ లెవెల్ లో బలోపేతం చేద్దామన్నారు. స్థానిక సమస్యలపై స్థానిక నాయకత్వం ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే నినాదాలుగా ప్రజల్లోకి వెళ్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు  అల్లాడి జయరాం, మేకల ఈశ్వర్, పూల శివప్రసాద్, ఆంజనేయులు, పెద్దన్న, మహేష్, నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

See also  వినుత కోటా ఆధ్వర్యంలో రెండవ రోజు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం