గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన మధుసూదన్ రెడ్డి

    ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన K రమణ బత్తలపల్లి నుండి మద్దెల చెరువుకు వెళ్తుండగా మార్గమధ్యంలో బైక్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో రమణ తలకి సర్జరీ అవ్వడంతో విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి రమణని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆసుపత్రి ఖర్చులకు గాను 10 వేల రూపాయలను అందజేయడం జరిగింది. అలాగే గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలను తెలుసుకుని జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వారి సమస్యలన్నీ తీరుస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

See also  అనంత ప్రజల రైతుల త్రాగు సాగునీరు అందేనా !!