
రైలు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయిన యువకునికి జనసేన ఆర్థిక సహాయం
మూడేళ్ల క్రితం రైలు ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకున్న శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బలరాం పేట గ్రామానికి చెందిన మోర అన్నం నాయుడుకు (29) బుధవారం జనసేన పార్టీ తరుపున టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు ₹10,000/- నగదు మొత్తాన్ని సహాయంగా అందజేశారు. దాతల సహాయం కోసం ఆయన తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు మదార్ (బన్నీ) తన సేవా భావంతో ఆ యువకునికి 10 వేలు ఆర్థిక సహాయాన్ని టెక్కలి జనసేన పార్టీ నాయకుల ద్వారా ఈ సందర్భంగా అందించారు. ఈ కార్యక్రమంలో పసుపు రెడ్డి సోమేశ్, రాయి సునీల్, బొడ్డేపల్లి వెంకటేష్, తోట శ్యామ్, హనుమంతు దిలిప్ తదితరులు పాల్గొన్నారు.









