జనసేన, టిడిపి టార్గెట్ 2024

– పక్కా వ్యూహంతో టిడిపి జనసేన ఆత్మీయ సమావేశాలు

– జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తో చల్లా బాబు బేటీ

– తిరుపతి నియోజకవర్గ సమన్వయ సమావేశంపై నగర కమిటీతో భేటీ అయిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

   తిరుపతి ( జనస్వరం ) : వచ్చే ఎన్నికలే టార్గెట్ గా జనసేన, టిడిపి సమన్వయంతో పనిచేస్తున్నాయని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయనతో పుంగనూరు టిడిపి ఇన్ చార్జ్ చల్లా బాబు తిరుపతిలో భేటీ అయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో టిడిపి-జనసేన ఉమ్మడిగా పనిచేసి వైసిపిని ఇంటికి సాగనంపాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉందని, అందరు నాయకులు కలుపుకొని పోవాలని సూచించారు. ప్రోటోకాల్ ఇబ్బంది లేకుండా చూస్కోవాలన్నారు. ఈనెల 17న పుంగనూరులో నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందని, అందులో ఉమ్మడిగా చేపట్టవలసిన ఆందోళనలపై చర్చిస్తామన్నారు. టిడిపి జనసేన ఉమ్మడి పోరాటాలతో వైసిపిని గద్దె దింపడం ఖాయమన్నారు.

See also  పాఠశాలల్లో తెలుగు మీడియం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి