88వార్డ్ సత్తివానిపాలెం గ్రామంలో డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన

88వార్డ్ సత్తివానిపాలెం గ్రామంలో డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన

          విశాఖపట్నం 88వ వార్డ్ సత్తివానిపాలెం గ్రామం, పెందుర్తి నియోజకవర్గం లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన ప్రజలు వ్యాధితో బాధ పడుతున్నా, రోడ్డు విస్తరణ జరగకపోవడం వలన యాక్సిడెంట్ జరిగిన, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో వబ్బిన జనార్ధన్ శ్రీకాంత్ కార్పొరేటర్ అభ్యర్థి అధ్యక్షతన ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.  శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఒకప్పుడు పంచాయతీ గా ఉన్న ఈ ప్రాంతం జివిఎంసిలో విలీనమైన అభివృద్ధి మాత్రం నోచుకోలేదని డ్రైనేజీ లేక పోవడం వల్ల మురికి నీరు నిల్వ ఏర్పడి ప్రజలు వ్యాధికి గురవుతున్నారని, రోడ్డు విస్తరణ చేయకపోవడం వలన యాక్సిడెంట్ కి ఎక్కువ అయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వాన్ని వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో శంకర్, ఈశ్వర్, నాయుడు, రూపేష్, జనసైనికులు, మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

See also  పుల్వామా దాడిలో మరణించిన వీర జవానులకు నివాళులు అర్పించిన జనసేన నాయకులు జయరాం రెడ్డి