ధర్మవరంలో క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్లు పంపిణీ

ధర్మవరం

      ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను వాలంటీర్స్ కు, కార్యకర్తలకు అందజేసి వారిని సన్మానించి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన జనసేన పార్టీ గుర్టైన గాజు గ్లాసు, పార్టీ నోట్ బుక్స్, పార్టీ బ్యాగ్స్ ను పంపిణీ చేయడం జరిగింది.అనంతరం క్రియాశీలక వాలంటీర్స్ తో చిలకం మధుసూదన రెడ్డి మాట్లాడుతూ ఎంతో కష్టపడి ధర్మవరం నియోజకవర్గం మొత్తం 2303 క్రియాశీలక సభ్యత్వాలు చేసిన ప్రతి ఒక్క వాలంటీర్ కు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రతి ఒక్క క్రియాశీలక కార్యకర్తకు అండగా ఉంటామని తెలియజేశారు. జనసేన పార్టీని ప్రతి ఒక్క క్రియాశీలకు సభ్యుడు ముందుకు తీసుకువెళ్లాలని అలాగే క్రియాశీలక వాలంటీర్లకు, సభ్యులకు పార్టీలో ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వలన ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో క్రియాశీలక సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా సౌకర్యం మరియు 50 వేల మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని తెలియజేశారు.

See also  ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కృషి