
లింగాల మునేటి వంతెనను మరమ్మత్తులు చెయ్యాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం లింగాల గ్రామం మునేటి వంతెనను మరమ్మత్తులు చేయాలనీ జనసేన పార్టీ నాయకులు మండల డెవలప్మెంట్ అధికారులకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ గతంలో కురిసిన వర్షాలకు లింగాల మునేటి వంతెన మీద వరద నీరు ప్రవహించడం వల్ల రోడ్డు మొత్తం కొట్టుకుపోయి గుంతలు ఏర్పడి వచ్చే పోయే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయం లో వంతెన మీద గుంతలు గమనించక ఆక్సిడెంట్ కు గురవుతున్నారు అంతేకాకుండా వంతెనకు ఇరువైపులా డివైడర్ లు కూడా సరిగాలేని పరిస్థితి కావున దయచేసి అధికారులు త్వరతిగతిన స్పందించి మరమ్మత్తులు చేయాలనీ జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు రాజేష్ మరియు జనసేన పార్టీ మండల నాయకులు రేగండ్ల వెంకట రామయ్య, రవి, కృష్ణ, గోపి, సురేష్, వంశి, భూషణం, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.








