పెనుగంచిప్రోలు నుంచి సుబ్బాయిగూడెం వెళ్లే రహదారి మార్గాన్ని మరమ్మత్తులు చెయ్యాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

పెనుగంచిప్రోలు నుంచి సుబ్బాయిగూడెం వెళ్లే రహదారి మార్గాన్ని మరమ్మత్తులు చెయ్యాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

                పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామం నుంచి సుబ్బాయిగూడెం వెళ్లే రహదారి మార్గాన్ని జనసేన పార్టీ నాయకులు బాడిశ మురళీకృష్ణ బృందం రహదారిని సందర్శించారు. రహదారి మొత్తం గుంతలు పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారడంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రహదారిని తక్షణమే పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయాలనీ జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మరియు మండల నాయకులు తునికిపాటి శివ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ పెనుగంచిప్రోలు నుంచి సుబ్బాయిగూడెం వెళ్తున్న రహదారి మొత్తం గుంతలతో కూరుకుపోయి వాహనదారులకు చాలా ఇబ్బంది కరంగా మారింది. ఇంతకు ముందు మరమ్మత్తులు చేసాము అని చెప్పుకుంటున్న గుంతల దగ్గర తూ.. తూ.. మంత్రంగా రెండేసి బొచ్చలు కంకర పోసినారు. అది ఈ మధ్య కురిసిన వర్షాలకు కంకర మొత్తం వరదకి కొట్టుకు పోయి మరి దారుణంగా తయారైంది. రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వాహనదారులు వాహనాలు క్రిందపడి గాయాలపాలవుతున్నారని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. ప్రమాదాలు జరిగిన తరువాత అనుకున్న ప్రయోజనం ఉండదని ముందుగానే ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ రహదారిని పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయాలనీ జనసేన పార్టీ తరపున మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తునికిపాటి శివ, గోపి చారి, నవీన్, గోపయ్య, యస్వంత్, రాము తదితరులు పాల్గొన్నారు.

See also  రాయలసీమలో తీరని దాహం, పట్టించుకోని ప్రభుత్వం : దారం అనిత