గాజువాకలో వరలక్ష్మి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని జనసేన పార్టీ ఆధ్వర్యలో నిరసన కార్యక్రమం

గాజువాకలో వరలక్ష్మి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని జనసేన పార్టీ ఆధ్వర్య౦లో నిరసన కార్యక్రమం

               గాజువాక శ్రీనగర్ కాలనీలో, ఒక మైనర్ బాలిక దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆ మైనర్ బాలికను అతి హింసాత్మాకకంగా దాడి చేయడం జరిగింది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 65వవార్డు జనసేన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి రెయ్యి రత్న గారు మరియు వీర మహిళలు విద్యార్థులతో అందరూ తో కలిసి ఈరోజు బీసీరోడ్డు కాకతీయ కూడలి వద్ద వరలక్ష్మి కి మద్దతుగా వరలక్ష్మి చావు కి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించి ఉరి తీయాలి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం రెయ్యి రత్న మాట్లాడుతూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసి, వారికి న్యాయం జరిగే వరకు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని తెలియచేసారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, హోమ్ మినిస్టర్ మహిళగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఆ మైనర్ బాలికను అతి దారుణంగా చంపబడినా కూడా, ఇంతవరకు హత్య చేసినటువంటి వారిపైన చర్యలు చేపట్టకపోవడం చాలా దురదృష్టకరం. ఎటువంటి ఒత్తిళ్లుకి లొంగకుండా కఠినమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరుపున కోరుతున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుంటూరు మూర్తి గారు, 62వవార్డు వార్డ్ బీజేపీ అభ్యర్థి ములకలపల్లి ప్రకాష్ అడ్వకేట్ కళావతి గారు, 64వవార్డు జనసేన నాయకులు ఎరిపిల్లి నూకరాజు, ములకపల్లి వంశీ, వార్డ్ జనసైనికులు ఢిల్లీ జగదీష్, సత్యం, శ్యామ్, జనసైనికులు, విద్యార్థులు వీర మహిళలు, తదితరలు పాల్గొన్నారు .

See also  జనసేనపార్టీ పోరాట ఫలితంగా రోడ్డును ఏర్పాటు చేసిన అధికారులు