నెల్లూరు ( జనస్వరం ) : జనసేన జిల్లా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంత చెప్పినా దీనికి అర్థం కాదని గాడిదని చూపిస్తూ ఒకే తరహాలో ఓండ్ర పెట్టడం తప్ప ఆలోచన చేసే ధోరణి లేదా అని ప్రెస్ మీట్ లో తెలిపారు. ఆయన మాట్లాడుతూ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి వాలంటరీ వ్యవస్థకు వ్యక్తిగత సమాచారం ఎందుకు ఇవ్వాలి,అది దుర్వినియోగం అవుతుందని పవన్ కళ్యాణ్ గారు అడిగితే సంస్కారం లేని మాటలు మాట్లాడతావు అది నోరా కుప్పతొట్టా జగన్… ఐడి కార్డు లేకుండా వాలంటీర్లు సమాచారాలు సేకరిస్తున్నది వాస్తవం మాన్యువల్ గా, ట్యాబ్ లో తీసుకున్న ఐపాక్ లో నమోదు చేస్తున్నారు. ఈ వ్యక్తిగత సమాచారం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల ఎఫ్ ఓ ఎ ఆధ్వర్యంలో ఉండటం అనేది ఎంత నిజమో తెలుసు. నిన్నటికి నిన్న ఎస్పీ గారు మీటింగ్ పెట్టి కేవైసీ వ్యక్తిగత ఆధారాలు కారణంగా లక్షలు డబ్బులతో దోపిడీ గురించి ప్రస్తావించిన మాట మీకు బోధపడినట్లు లేదు. నిన్న బ్రాహ్మణ కాక లో రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం ఆధారంగా 80 లక్షలు దుర్వినియోగం చేస్తూ వేరే వారి ఖాతాలకు మళ్లింపు చూడలేదా. నీ స్క్రిప్ట్ రాసే వాడికి జీతాలు ఇవ్వడం లేదేమో ఒకే స్క్రిప్ట్ రాసి మాకు బోర్ కూడా బోర్ కొడుతుంది. ఈ రోజున బహిరంగ సభలో పనికిమాలిన మాటలు మాట్లాడే మీరు మీ పిల్లలు వాళ్ళ వాలంటీర్లు అన్నావు. మీ పిల్లలకి ఇచ్చే జీతాలు ప్రభుత్వం ఎందుకు కట్టాలి జగన్. వ్యక్తిగత సమాచారం అంతా తీసుకొని ఏ ఇంట్లో ఎంతమంది మహిళలు ఎంతమంది ఉద్యోగస్తునారు ఎంతమంది ఆస్తిపాస్తులు ఉన్నాయి ఎంతమందికి ఏ పథకాలు వస్తున్నాయి తెలుసుకొని ఒక బటన్ తో వాళ్ళ రాతను తలకిందులు చేసేటట్లు ఒక వ్యవస్థను మాఫియాని రన్ చేస్తున్నావు అన్నది నిజం. కార్యకర్తలుగా పని చేయించుకుంటున్న వాలంటీర్లకు ప్రభుత్వం ఎందుకు జీతాలు ఇవ్వాలి. కొంతమంది వాలంటీర్లు చేస్తున్న తప్పుడు పనుల వల్ల మిగిలిన అమాయక యువత ఎందుకు బలి కావాలి నిన్నటి రోజున బ్రాహ్మణ కాక లో జరిగిన లాంటి అవినీతి బాధ్యులు ఎవరు..? లాగిన్ ఐడి అంతా వాళ్లకిే ఇచ్చి జరిగిన అవినీతి కి ఐదువేల జీతం తీసుకునే వాలంటరీ ఏ విధంగా బాధ్యులు అవుతారు. వీటికి జవాబుదారు ఎవరు వాలంటీర్లకు బాస్ ఎవరో తమరు తెలపాలి. రాష్ట్రంలో అక్కడక్కడ వాలంటీర్లు మహిళలను వేధించడం నీ కళ్ళకు కనిపించలేదా. బెంగళూరు ప్యాలెస్ లో చేసిన అరాచకాల చట్ట అందరికి తెలుసు అక్కడ రాసలీలలు గురించి వైసిపి మంత్రుల గంట వ్యవహారాలను అందరికీ తెలిసినవే… మిమ్మల్ని పాపం పసివాడు అనుకునే పరిస్థితి లేదు. జగన్ కి కళ్ళముందు ఓటమి కనిపిస్తుంది అందుకే ఏం మాట్లాడాలో తెలియక పిచ్చిపిచ్చిగా వెర్రి కేకలేస్తున్నాడు. ఒక వ్యక్తి పై కోర్టులో విచారణ జరిపించాల్సిందిగా జీ వో జారీ చేసిన మొట్టమొదటి పిచ్చి ముఖ్యమంత్రి గా నిలిచి పోతావు జగన్. నాలుగు సంవత్సరాల వైఫల్య పాలన ప్రజలు గమనిస్తూనే ఉన్నారు తగిన గుణపాఠం చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నవి. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు సుధా మాధవ్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, నిర్మల, సురేష్, చిన్నరాజా, షాజహాన్, ఖలీల్, హేమచంద్ర యాదవ్, వర, మౌనిష్, హరి, శీను తదితరులు పాల్గొన్నారు.