మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట విజయోత్సవ ర్యాలీ

పవనన్న

           రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట పట్టణంలో జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట విజయోత్సవ ర్యాలీ. మన్నూరు శివారు ఎల్లమ్మ గుడిలో పూజల అనంతరం పాదయాత్ర గా వజ్రం కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ చేశారు.  బైక్ ర్యాలీ నిర్వహించిన జన సేన యువత. ఆరుమండలాల జనసేన నేతలు,కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి ని చేయడమే తమ లక్ష్యమని ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ వెల్లడి. రాజంపేట ప్రజల అభివృద్ధి సంక్షేమ లక్ష సాధన కోసం మీ ముందుకు వస్తున్నానని ఆదరించి ఆశీర్వదించాలని మలిశెట్టి వెల్లడి. ఇంకా నాయకులు చాలామంది ఉన్నారని వారిని కొందరు లోకల్ గా ఉన్న నాయకుల తొక్కేస్తున్నారని వారినందర్నీ గుర్తించి పవన్ కళ్యాణ్ గారు జనసేన అని ఒక మంచి ప్లాట్ఫారం గా చేయాలని మలిశెట్టి వెంకటరమణ అన్నారు. జనసేన పార్టీ కోసం చాలామంది కృషి చేస్తున్నారని వారిని కచ్చితంగా గుర్తిస్తారని, పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారని తప్పకుండా అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా అందరిని కూడా గుర్తించి జనసేన దీటుగా నిలబడి గెలుస్తుందని మలిశెట్టి వెంకటరమణ తెలిపారు.

See also  లెక్కలు చూపించండి మంత్రి గారూ..? - దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లికి జనసేన పార్టీ అమ్మవారి ధార్మిక సేవ మండలి సూటి ప్రశ్న?