ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం యొక్క మోసపూరిత, నిర్లక్ష్య వైఖరికి బలైన కార్మికులకి జనసేన నాయకుల అండ

ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం యొక్క మోసపూరిత, నిర్లక్ష్య వైఖరికి బలైన కార్మికులకి జనసేన నాయకుల అండ

                  రామచంద్రపురం నియోజకవర్గం, ద్రాక్షారామ పట్టణానికి చెందిన రవిందర్ ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం యొక్క మోసపూరిత, నిర్లక్ష్య వైఖరికి బలై నేడు న్యాయం కోసం మూడు రోజులుగా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద దీక్ష చేస్తున్న కార్మిక సోదరులు వి రాంబాబు, కె సత్తి బాబు, వి సత్తిబాబు, వి నాగ వెంకట రాజు, పి రాంబాబు, కె సాయి బాబు, కె లక్ష్మణ్, పి వీరయ్య లను కలిసి వారికి మద్దతుగా జనసేన పార్టీ నాయకులు శ్రీ డేగల సతీష్ గారు సంఘీభావం తెలియజేయడం జరిగింది. 1947 పారిశ్రామిక వివాదాల చట్టాన్ని (1947 Industrial Disputes Act) ఉల్లంఘిస్తూ వివాదం సమసి పోకుండానే ఈ కార్మిక సోదరులను యాజమాన్యం ఎటువంటి ముందస్తు సమాచారం అందివ్వకుండా విధుల నుండి తీసివేయడమే కాకుండా మొన్న లాక్ డౌన్ లో తమ హక్కుల కోసం నిరశన తెలుపుతున్న వీరి పైన పోలీసు వారితో అక్రమ కేసులు బనాయించడం జరిగింది. డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ మరియు ఇతర సిబ్బంది కూడా యాజమాన్యంతో కుమ్మక్కై ఈ కార్మిక సోదరులను ఇబ్బంది పెట్టడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే అంశం. దీనిపైన మున్ముందు ఎటువంటి కార్యాచరణ ప్రకటించినా జనసేన పార్టీ తరపున పూర్తి స్థాయిలో వారికి మద్దతు ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.

See also  వేమూరులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు