
కరోనాతో మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబానికి రూ. 50,000 ఆర్థిక సాయం అందించిన తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం నియోజకవర్గం జువ్వలపాలెం కి చెందిన జనసైనికుడు వట్టిపులుసు దుర్గాప్రసాద్ కరోనాతో అకాల మరణం చెందటం వల్ల దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి తనవంతు సహాయంగా 50,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేసి, ఆ కుటుంబానికి నేనున్నాను అని మనోధైర్యాన్ని ఇచ్చిన తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.









