జనసేన అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు మర్రాపు సురేష్

       విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో దశాబ్ధాలుగా నెలకొన్న సమస్యలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృషికి పార్టీ నేత మర్రాపు సురేష్ తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా గజపతినగరం నియోజకవర్గ సమస్యలతో పాటు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మౌలిక సదుపాయల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అధ్యక్షులకు వివరించారు. జిల్లా సమస్యల పై పార్టీ అధ్యక్షులతో చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ని శాలువాతో సత్కరించారు.

See also  జనసేనపార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న మాడుగుల జనసైనికులు