పల్లె పల్లెకు జనసేన పార్టీ సిమెంటు బెంచ్ లు

పల్లె పల్లెకు

               మర్రిపాడు ( జనస్వరం ) : మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకుడు శ్రీరామ మనోహర్  సౌజన్యంతో పల్లె పల్లెకు జనసేన పార్టీ సిమెంటు బెంచ్ లు ఏర్పాటు చేశారు. 10వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కృష్ణాపురం బెడుసుపల్లి గ్రామంలో జనసేన పార్టీ మర్రిపాడు మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి, జనసైనికులు చేతులు మీదుగా ప్రారంభించడం జరిగింది.  అనంతరం మండల అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు పది బెంచ్ లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన జనసేన నాయకులు. శ్రీరాం మనోహర్ గారికి మర్రిపాడు మండల జనసేన పార్టీ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు బద్దిక సందీప్ వెంకటసుబ్బయ్య, రాజేష్, వెంకటేష్, గురుచరణ్ శ్యామ్, మంచాల వెంకటేష్, చిన్నా జనసేన పాల్గొన్నారు.

See also  ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను కొనసాగించాలని ఆర్డీవో కు వినతిపత్రాన్ని అందించిన జనసేన ఇంఛార్జ్ మధుసూదన్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి