దొంగలకు దొంగ జగన్మోహన్ రెడ్డి – పోస్టర్ ఆవిష్కరణ

దొంగలకు దొంగ

      తిరుపతి ( జనస్వరం ) : జగన్మోహన్ రెడ్డి దొంగలకు దొంగ.. జగన్ అండ్ కో అంటూ పోస్టర్ విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “పాపం పసివాడు అంటూ పోస్టర్ ను ట్వీట్ చేసిన వెంటనే, జగన్ రెడ్డి అండ్ ముఠా ఉలిక్కి పడ్డారని తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. మీరు సినిమా తిస్తాం అంటారు, మేము సినిమా తీసి చూపించాం, జగన్మోహన్ రెడ్డి అండ్ కో దుర్మార్గాలపై రోజుకో పోస్టర్ ను విడుదల చేస్తామని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, వైఎస్సార్ కాంగ్రెస్ ను అద్దెకు తెచ్చుకుని కబ్జా చేశాడని, రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి అండ్ కోలతో కబ్జాలమయం అయిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, హేమ కుమార్, ముక్కు సత్యవంతుడు, బలరామ్, మునస్వామి, కిషోర్, మనోజ్, షరీఫ్ పాల్గొన్నారు. 

See also  ప్రజల మధ్యనే వినాయకచవితి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి