తెర్లం మండలంలో జనసేన ప్రజా చైతన్య యాత్ర

తెర్లం

          బొబ్బిలి ( జనస్వరం ) : తెర్లం మండలంలో ఉన్న చిన్న శివడ వలస గ్రామం, బొబ్బిలి మండలం శివడ వలస గ్రామంలో స్థానిక జనసైనికులు ఆహ్వానం మేరకు జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 16వ రోజు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ అప్పలస్వామి పర్యటించడం జరిగింది. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కారానికై తగు కార్యచరణ రూపొందించడం జరిగింది. చిన్న శివడ వలస ప్రధాన సమస్య రోడ్డు అనేది గుర్తించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గాని మండల నాయకులు గాని మారుమూల ప్రాంతం అయినందున ఈ గ్రామాన్ని పట్టించుకోవడం లేదు ఇంతవరకు కూడా ఎవరు కూడా వెళ్లలేదన్నారు. ఈరోజు బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ అప్పలస్వామి గారు గ్రామాన్ని పర్యటించి ప్రధాని సమస్య రోడ్డు అని తెలుసుకొని ఆ రోడ్డు యొక్క సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికై కృషి చేస్తామన్నారు.

See also  ఇచ్చిన మాట ప్రకారంగా ఇళ్ళు కాలిపోయిన బాధితులకి దుప్పట్లు పంపిణీ చేసిన జనసేన వీర మహిళా శ్రీ కాంతి శ్రీ గారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి