పశ్చిమ విశాఖలో జనసేన – బీజేపీ ఆధ్వర్యంలో వంతెన మరియు రహదారులను పట్టించుకోవాలని నిరసన

పశ్చిమ విశాఖలో జనసేన – బీజేపీ ఆధ్వర్యంలో వంతెన మరియు రహదారులను పట్టించుకోవాలని నిరసన

          విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 89 వార్డ్ పరిధి లో 14 గ్రామాలు ప్రయాణం సాగించే ఎల్లపువాణిపాలెం నుంచి కాంకోర్ యార్డ్ రహదారి మధ్యలో రైల్వే బ్రిడ్జిలు వద్ద సరైన రహదారి లేక వర్షాకాలంలో రహదారిపై నీరు నిలవడంతో గోతులు మయంగా మారింది ఆ మార్గం దుస్థితి. ఎందరో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆ మార్గంలో ప్రయాణం సాగించిన ఆ సమస్యని పట్టించుకున్న నాధులు లేరు. మరి ఈ సమస్య 14 గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గతంలో కేంద్ర మంత్రి గారుకి మరియు రైల్వే డి ఆర్ ఎం గారుకి సమస్య పై 2సార్లు వినతిపత్రం అందించి ఎప్పటికపుడు అధికారులు పై ఒత్తిడి సారిస్తున్నారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి ఇంజినీర్ ఇన్స్పెక్షన్ కూడా జరిగింది, నేడు రైల్వే ZRUCC మెంబెర్ జిసి నాయుడు గారు పర్యటించి తదుపరి రహదారి ప్లాన్ నిమిత్తం రైల్వే అధికారులు కలిసి ఈ సమస్యని బ్రిడ్జి ఎక్స్టెన్షన్, రహదారి పూర్తి అయ్యేవరుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు పై ఒత్తిడి సారించి పరిష్కరిద్దామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బాల రాజేశ్వరరావు గారు మరియు జన సైనికులు పిలుపు మేరకు కార్యక్రమంలో జనసేన వెస్ట్ కన్వీనర్ పీలా రామకృష్ణ గారు, వల్లిరెడ్డి శ్రీనివాస్ గారు, 89వార్డ్ అధ్యక్షులు గొర్ల అప్పలరాజు గారు, ప్రధాన కార్యదర్శి బి రాము, ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్, బి జోగరావు కె మూర్తి, పురుషోత్తం, లక్ష్మణ్, గోపి మరియు బీజేపీ-జనసేన కార్యకర్తలు హర్ష, అజయ్, వెంకట్, కనకరాజు, మెడికల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారితోనే మా భవిష్యత్తు అంటున్న ఒంగోలు ప్రజానీకం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి