Logo
Date of Publish : 18 October 2020, 3:23 pm
Editor : Sake Naresh

పశ్చిమ విశాఖలో జనసేన – బీజేపీ ఆధ్వర్యంలో వంతెన మరియు రహదారులను పట్టించుకోవాలని నిరసన

పశ్చిమ విశాఖలో జనసేన - బీజేపీ ఆధ్వర్యంలో వంతెన మరియు రహదారులను పట్టించుకోవాలని నిరసన

          విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 89 వార్డ్ పరిధి లో 14 గ్రామాలు ప్రయాణం సాగించే ఎల్లపువాణిపాలెం నుంచి కాంకోర్ యార్డ్ రహదారి మధ్యలో రైల్వే బ్రిడ్జిలు వద్ద సరైన రహదారి లేక వర్షాకాలంలో రహదారిపై నీరు నిలవడంతో గోతులు మయంగా మారింది ఆ మార్గం దుస్థితి. ఎందరో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆ మార్గంలో ప్రయాణం సాగించిన ఆ సమస్యని పట్టించుకున్న నాధులు లేరు. మరి ఈ సమస్య 14 గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గతంలో కేంద్ర మంత్రి గారుకి మరియు రైల్వే డి ఆర్ ఎం గారుకి సమస్య పై 2సార్లు వినతిపత్రం అందించి ఎప్పటికపుడు అధికారులు పై ఒత్తిడి సారిస్తున్నారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి ఇంజినీర్ ఇన్స్పెక్షన్ కూడా జరిగింది, నేడు రైల్వే ZRUCC మెంబెర్ జిసి నాయుడు గారు పర్యటించి తదుపరి రహదారి ప్లాన్ నిమిత్తం రైల్వే అధికారులు కలిసి ఈ సమస్యని బ్రిడ్జి ఎక్స్టెన్షన్, రహదారి పూర్తి అయ్యేవరుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు పై ఒత్తిడి సారించి పరిష్కరిద్దామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బాల రాజేశ్వరరావు గారు మరియు జన సైనికులు పిలుపు మేరకు కార్యక్రమంలో జనసేన వెస్ట్ కన్వీనర్ పీలా రామకృష్ణ గారు, వల్లిరెడ్డి శ్రీనివాస్ గారు, 89వార్డ్ అధ్యక్షులు గొర్ల అప్పలరాజు గారు, ప్రధాన కార్యదర్శి బి రాము, ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్, బి జోగరావు కె మూర్తి, పురుషోత్తం, లక్ష్మణ్, గోపి మరియు బీజేపీ-జనసేన కార్యకర్తలు హర్ష, అజయ్, వెంకట్, కనకరాజు, మెడికల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com