విజయవాడ, (జనస్వరం) : పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ ను పురస్కరించుకొని పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక పంపిణీ కార్యక్రమం చిట్టినగర్ మోతి మసీద్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, మైలవరం ఇంచార్జ్ ఇన్చార్జి, అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), సెంట్రల్ నియోజకవర్గ నాయకులు బొలిశెట్టి వంశీ, ప్రముఖ న్యాయవాది పిల్లా శ్రీనివాసరావు, మోతి మసీద్ అధ్యక్షులు కాజా, నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్ కమల్ల సోమనాథం పాల్గొని ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మత పెద్దలు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారికి బట్టలు పంపిణీ చేశారు. 1200 మంది ముస్లింలకు 9 ఐటమ్స్ తో కూడిన రంజాన్ కానుక కిట్ ను అందజేశారు. (ఈ కిట్ లో కేజీ బాసుమతి బియ్యం, కేజీ గోధుమపిండి,1/2 కేజీ సేమియా, 1/2 కేజీ పంచదార, 200 గ్రాముల మంచి నూనె,10 గ్రాముల నెయ్య, 50 గ్రాముల పసుపు,50 గ్రాముల కారం,1 చేతి సంచి) ఈ సందర్భంగా పాల్గొన అతిథులు, పోతిన మహేష్ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ తరపున తెలియజేశారు భగవంతుడు అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. పోతిన మహేష్ ప్రతి సంవత్సరం పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున పేద, సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక అందజేయడం జరుగుతుందని అదేవిధంగా మా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పశ్చిమ నియోజకవర్గంలోని దారుల్ వుర్లు హలేమా మదర్సా కు ఐదు లక్షల రూపాయలు చెక్ రూపంలో అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు కోరగంజి వెంకటరమణ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. మైనారిటీ నాయకులు షేక్ అమీర్ భాష, సయ్యద్ మొబినా, షేక్ షహినా, ఎస్.కరిముళ్ళ, ఎస్.డీ కరిముళ్ల, రఫీ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్డూరి తమ్మారావు, రెడ్డిపల్లి గంగాధర్, పొట్నూరి శ్రీనివాసరావు, సోమి గోవిందరావు, నల్లబిల్లి కనకారావు, సింగినం శెట్టి రాము, ఆకుల రవిశంకర్, నేమాల సంజీవరావు, పిల్ల వంశీ, ఏలూరు సాయి, శరత్, బొమ్మ రాంబాబు, తిరుపతి, అనూష, కూరాకుల సురేష్, ఎం.హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.