చిత్తూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండల కేంద్రం నుండి జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న మాట్లాడుతూ ప్రజల దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అని, గంగాధర నెల్లూరు చెత్త పుత్రుడు నారాయణస్వామి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నారాయణ స్వామి వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని అది మంచి పద్ధతి కాదని, నీ వ్యక్తిగతం చాట భారతమని ద్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని ప్రశ్నించే ప్రజలు ఉండాలని, అదే నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందని తెలిపారు. ప్రశ్నించే ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత ప్రజాప్రతినిధికి ఉండాలని అప్పుడే ప్రజాస్వామ్యం బ్రతికి ఉందని అర్థం అని తెలియజేసారు. ప్రజాస్వామ్యానికి అర్థం తెలియని ఉపముఖ్యమంత్రి మతిభ్రమించి మాట్లాడడం ఇక విశ్రాంతి తీసుకోవడం మేలనిపిస్తుందని తెలిపారు. ఎందుకు నీకు ఈ రాజకీయ ఆరాటం? ఒక నిరుపేద మహిళ డ్రైనేజీ సమస్యను, ఇంటి నిర్మాణ మంజూరు పత్రం ఇవ్వలేదని ప్రశ్నించడం తప్పా? అని, మండల కేంద్రంలోని పూరిళ్లకు జగనన్న కాలనీ వర్తించదా? అని ప్రశ్నించారు. నిజమైన లబ్ధిదారులు నిన్ను అడగడం ధిక్కారమా? లేదా నువ్వేమైనా దేవుడా? లేదా సృష్టికర్తవా? అని, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓట్లు వేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న నిన్ను, నిరుపేద బడుగు జీవులు డ్రైనేజీ కాలువలు అడగడం తప్పా? ఎద్దేవ చేసారు. వాళ్ల సమస్యలు మీ దగ్గర చెప్పుకోవడం తప్పా? సమాధానం చెప్పడం నీ వల్ల కాకపోతే వెంటనే రాజీనామా చెయ్ అని డిమాండ్ చేసారు. సంయమనంతో సమాధానం చెప్పలేని ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదని తెలిపారు. ఓటు వేసిన వారికీ చాలీచాలని బతుకులు, ఓటు వేయించుకున్న వారు విలాస భవంతులు అనుభవిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, గ్రామాల్లో విప్లవం రావాలని కోరారు. నారాయణస్వామి పోవాలి, జనసేన రావాలని ఉద్ఘటించారు. పద్మ సరస్సు జగనన్న కాలనీ మంజూరులో అవకతవకలు జరిగిందని, నిజమైన లబ్ధిదారులను గుర్తించలేదని, దీనిపై బహిరంగ విచారణకు నేను సిద్ధం. మరి నువ్వు సిద్ధమా స్వామీ? అని సవాల్ విసిరారు. ఇందులో గుర్తించిన వారంతా నిజమైన లబ్ధిదారులైన నిరుపేదలే అని తెలితే! నేను శిరచ్చేదనకు సిద్ధం, అలా లేకుంటే., నువ్వు శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుని కుటుంబ వారసత్వానికి ముగింపు పలుకుతావా? అని సవాల్ విసిరారు.