కరోనా వారియర్స్ కు అభినందనలు తెలిపిన లక్ష్మిపురం గ్రామ జనసైనికులు

కరోనా వారియర్స్ కు అభినందనలు తెలిపిన లక్ష్మిపురం గ్రామ జనసైనికులు

             అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, లక్ష్మీపురం గ్రామ జనసైనికులు కరోనా వారియర్స్ కు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో దేశ రక్షణ లో భాగంగా మైనస్ డిగ్రీ సెంటిగ్రేట్ పరిస్థితుల్లో కూడా భారత సైనికులు పోరాడుతున్నారు. వారి సేవలు ఆదర్శనీయం. పోలీసు సిబ్బంది నిర్విరామంగా పని చేస్తూ ప్రజలు ఇబ్బంది పడుకుండా చూస్తున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అనేక వైద్య సేవలు అందించడం స్పూర్తిదాయకం. జనసేన పార్టీ తరుపున భారత సైనికులు, పోలీసు సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బందికి అభినందలు తెలియజేస్తున్నాం అని  అన్నారు.  ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సోమరౌతు తాతారావు, సోమరౌతు నాంచారయ్య, సూదాని నందగోపాల్, సోమరౌతు చిన్మయ్,రవి చోడగం, సూదాని హేమంత్ కుమార్, సూదాని ఆనంద్ మరియు బీజేపీ నాయకులు పీతా లక్ష్మీ ప్రతాప్ పాల్గొన్నారు. 

See also  R&B రోడ్డులు ఆధ్వనా పరిస్థితిపై MDO గారికి వినతి పత్రం అందించిన అవనిగడ్డ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి