
నెల్లూరు, (జనస్వరం) : స్థానికుల అభ్యర్థుల మేరకు నిన్న నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వైయస్ నగర్ ను సందర్శించిన జనసేన నాయకులకు వారి సమస్యలను వివరిస్తూ జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు నివాసం నిమిత్తం ఇచ్చిన ఇల్లు పది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అభివృద్ధికి నేర్చుకోలేదు. కనీస వసతుల కల్పనలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎనిమిది సంవత్సరాలుగా ఒకే ఎమ్మెల్యే ఉన్నా కూడా వారు మౌలిక వసతులు సమకూర్చలేకున్నారని తెలిపారు. ప్రధాన సమస్యలైన మంచినీరు, రోడ్లు, పందులు దోమలు, పాములు, కరెంటు సౌకర్యాలు లాంటి కనీస అవసరాలు సమకూర్చడానికి సంవత్సరాలు తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే మౌలిక వస్తువులు పునరుద్దించాలని కలెక్టర్ ని కోరడం జరిగింది. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి కార్పొరేషన్ సిబ్బందిని పిలిచి ఇవన్నీ మన పరిధిలోని అంశాలే అని చెప్పి సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా తెలిపారు. రానున్న పదిహేను రోజుల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకుంటే సరాసరి లేకపోతే స్థానికులతో కలిసి జనసేన పార్టీ తరఫున సమస్యలపై నిరసనలు ఉదృతం చేసి సమస్యలు పరిష్కరించేవరకూ తోడుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జనసేన పట్టణ కమిటీ కార్యదర్శి కృష్ణవేణి, స్థానిక వైఎస్ఆర్ నగర్ జనసేన నాయకులు కరీం, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర, అమీన్, మౌనిష్, అలేఖ్, షాజహాన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.








