ఆచంటలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులు

ఆచంట

           ఆచంట ( జనస్వరం ) : డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని జనసేనపార్టీ గ్రామ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి ఆధ్వర్యంలో జనసైనికులు వల్లూరు గ్రామ సంత మార్కెట్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళ్ళర్పించారు. ఈ కార్యక్రమం లో జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ కు బంగారు బాటలు వేసిన మహనీయులు అంబేద్కర్ అని, ఎన్నేళ్లయినా భారతదేశ ప్రజల గుండెల్లో జీవించి ఉండే వ్యక్తి భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు, పంపన శ్రీనివాస్, సరిపల్లి వెంకటేశ్వరావు, తోట సాయిబాబా, మొదలగువారు పాల్గొన్నారు.

See also  జనసేనపార్టీ హఫీజ్ పేట్ డివిజన్-109 అధ్యక్షురాలిగా మద్దూరి నాగలక్ష్మి