పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి : జానీ మాస్టర్

జానీ మాస్టర్

నెల్లూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి జనసేన పార్టీని గెలిపించండి అనే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు సిటీ స్థానిక 51 డివిజన్ కార్యకర్తలను ఉత్తేజ పరచడానికి గునుకుల కిషోర్ ఆహ్వానం మేరకు కపాడిపాలెం విచ్చేసిన జానీ మాస్టర్ కేరింతల అభిమానుల మధ్య సభ కోలాహలం గా జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కట్టె కాలే వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమానినే, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం. మా కేరీర్ ఎదుగుదలో వారు, వారి కుటుంబం చాలా సహాయం చేశారు. చిన్ననాటి నుంచి ఈ ప్రదేశాల్లో చాలా వరకు తిరిగాను. నెల్లూరు నుంచి వెళ్లి ప్రపంచవ్యాప్తంగా అభిమానం సంపాదించినందుకు గర్వపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది నెరవేరాలి కిషోర్ మరియు అతని టీం ని అభినందిస్తున్నానని అన్నారు. జనసేన స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే వారితో మీరు తెలుపవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ… కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి మంచి ఉదాహరణ జానీ భాయ్ జీవితం. నెల్లూరు నుంచి వెళ్లి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్న ఆయన కృషి అభినందనీయం. ఎప్పుడు జనసేన పార్టీ తరపున కార్యక్రమాలకు ఆహ్వానించినా ఒక్క క్షణం ఆలోచించకుండా మాకు ప్రత్యక్షమయ్యే మంచి మనసున్న జానీ భాయ్ కి అంతా మంచి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా చాలా చాలా ఇష్టం అభివృద్ధి జరగాలంటే పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకెళ్లాలి జనసేన పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు..

See also  రైతులకు అండగా నిలిచిన ఏకైక పార్టీ జనసేన : ఎమ్మిగనూరు జనసేన నాయకులు