మక్కపేట నుండి బీమవరం వెళ్లే రోడ్డు మార్గాన్ని మరమ్మతులు చెయ్యాలి : జనసేన వెంకటరామయ్య

మక్కపేట నుండి బీమవరం వెళ్లే రోడ్డు మార్గాన్ని మరమ్మతులు చెయ్యాలి : జనసేన వెంకటరామయ్య

               కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం జనసేన పార్టీ మండల నాయకులు మక్కపేట గ్రామం నుండి బీమవరం వెళ్లే గుంతలతో కూరుకుపోయిన రహదారి మార్గాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండలం యువ నాయకులు రేగండ్ల వెంకట రామయ్య మాట్లాడుతూ మక్కపేట గ్రామం నుండి బీమవరం వెళ్లే రహదారి గుంతలతో కూరుకుపోయి వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది. రాత్రి పూట ప్రయాణించే ప్రయాణికుల కు చాలా ప్రమాదకరంగా మారడంతో వాహనదారులకు ఇబ్బంది గా మారింది. అలాగే అటువైపుగా వెళ్తున్న అంబులెన్సు లు వెళ్ళడానికి కూడా ఆ గుంతలు పడ్డ చోట చాలా ఇబ్బందికరంగా అస్తవ్యస్తంగా పరిస్థితి తయారైంది. కావున దయచేసి అధికారులు త్వరతిగతిన స్పందించి రోడ్డు మరమ్మతులు చెయ్యాలని వెంకటరామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో రాంబాబు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. 

See also  నాదెండ్ల మనోహర్ అరెస్టుని ఖండిస్తున్నాం : అంకె ఈశ్వరయ్య

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి