– ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ కి వస్తున్న ప్రజా ఆదరణ చూసి వైసీపీ కుట్రలు చేస్తుంది.
– అక్రమంగా అరెస్టు చేసిన జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.
– వికేంద్రీకరణ గర్జన విఫలమైంది.
– పోలీసులు వైసీపీకి అనుకూలంగా కాదు చట్టానికి అనుగుణంగా పని చేయాలి
విజయవాడ, (జనస్వరం) : విశాఖ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ను అడ్డుకోవటం హేయమైన చర్య అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్ అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ అక్రమంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేశారని, తక్షణమే వారిని విడుదల చేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనవాణి, ఇతర కార్యక్రమాలకు పోలీసులు వెంటనే అనుమతి మంజూరు చేయాలని, డిమాండ్ చేస్తూ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మహేష్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ కి వస్తున్న ఆదరణ చూసి వైసిపి నాయకులకు కుట్రలు చేస్తున్నారని, వికేంద్రీకరణ గర్జన విఫలమైందని, దానికి నైరాస్యం చెంది వైసీపీ నాయకులు కుట్రతో ఎయిర్ పోర్ట్ లో గందరగోళం సృష్టించారని, నిజంగా వేలాదిమంది జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్దలపై దాడులు చేస్తే వారు విమానం ఎక్కి విజయవాడ వచ్చి ప్రెస్మీట్లో పెట్టేవారా అని..?. విశాఖ సిటీ సీపీ శ్రీకాంత్ నిర్లక్ష్య వైఖరి వల్లే నిన్న ఎయిర్ పోర్ట్ లో అలజడి జరిగిందని, అందుకు వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని, వైసీపీ మంత్రులు రోజా జోగి రమేష్ జనసేన శ్రేణుల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించారని, సంఘటన గడిచి 20 గంటలు గడుస్తున్న విశాఖ సిపి ఇంతవరకు సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల చేయలేకపోయారంటే అసలు అక్కడ ఘటనే జరగలేదని, కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద అక్కసుతోనే ఇటువంటి అలజడి సృష్టిస్తున్నారని రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్యం అమలు కావడం లేదని అన్నారు. సీఎం జగన్ నియంతృత్వ పాలన మాత్రమే సాగుతుందని, ఇటువంటి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసునని, అక్రమంగా అరెస్టు చేసిన జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కృష్ణ పెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ విశాఖపట్నంలో పోలీసులు జనసేన పార్టీ నాయకులపై కుట్రలు చేశారని పవన్ కళ్యాణ్ కి అడుగడుగున అడ్డు తగిలారని ఎటువంటి కుట్రలో కుయుక్తులు చూస్తూ ఊరుకోమని వెంటనే జనవాణిని నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతిరెడ్డి అనిత మాట్లాడుతూ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని పవన్ కళ్యాణ్ కి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులకు కుట్రలు చేస్తున్నారని, ఇటువంటి ఆపకపోతే తప్పక తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. విజయవాడ నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాథం మాట్లాడుతూ వైసీపీ నాయకులకు మతిభ్రమించిందని పవన్ కళ్యాణ్ కి శనివారం విశాఖపట్నంలో ఆదరణ చూసి అవాక్కై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ని డిబేట్ కి రమ్మనేటప్పుడు జగన్ కూడా అదే డిబేట్ కి వస్తారా..? అని సవాల్ విసిరారు. జోగి రమేష్ కి దమ్ముంటే విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్ తో డిబేట్ చేయాలని సవాల్ విసిరారు. కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ రావి సౌజన్య మాట్లాడుతూ ప్రకృతి కూడా రాజధాని వికేంద్రీకరణ పై ఇష్టం లేకనే భారీ వర్షం కురిసిందని, శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ కి ప్రకృతి అనుకూలించబట్టే లక్షలాది మంది జనం పవన్ కళ్యాణ్ యాత్రలో భాగస్వామ్యం అయ్యారని, విశాఖపట్నంలో అలజడులు సృష్టించడం దుర్మార్గమని, ఇకనైనా వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో వీర మహిళలు తప్పక బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 7వ డివిజన్ అధ్యక్షులు దోమకొండ మేరీ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే రద్దు చేసుకొని వారిని బేషరతుగా విడుదల చేయాలని, పవన్ కళ్యాణ్ పై విషం చిమ్మితే చూస్తూ ఊరుకోమని ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్, నగర ప్రధాన కార్యదర్శులు మొబిన, లింగం శివప్రసాద్, కార్యదర్శులు కొరగంజి వెంకటరమణ, బోట్ట సాయి కుమార్, శనివారపు శివ, పోలాసి దుర్గారాణి, గుండు రాము, పాల రజిని, డివిజన్ అధ్యక్షులు సిగనం శెట్టి రాము, పొట్నూరి శ్రీనివాస్ రావు, కూరాకుల సురేష్, నల్లబెల్లి కనకారావు, వేంపల్లి గౌరీ , బొమ్ము రాంబాబు, శంకర్, పుప్పాల శ్రీనివాస్, బాధిక శంకర్, దాసరి నాగరాజు, పోతిరెడ్డి వెంకటరమణ, విట్ల హరిప్రసాద్, వేముల వెంకటేష్, అల్లిబిల్లి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి గన్ను శంకర్, ఆకారపు విజయ్ కుమారి, ఎస్.నరేష్, టీ.మురళీకృష్ణ, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.