రోడ్లు వేయండి – ప్రజల ప్రాణాలు కాపాడండి : పాలకొండ జనసేన నాయకులు

      పాలకొండ, (జనస్వరం) : పాలకొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్లు వేయండి – ప్రజల ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో పాలకొండ నుంచి ఉంగరాడా మెట్ట వరకు పాదయాత్రను మొదలుపెట్టారు. అక్కడి నుండి రాజాం నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులుఎన్ని రాజు ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న మహా పాదయాత్రకు సంఘీభావంగా పాలకొండ నుండి జనసేనపార్టీ నాయకులు పాలకొండ నుంచి పాదయాత్రగా బయలుదేరుకుంటూ మహా పాదయాత్రలో కలిసి పాదయాత్ర కొనసాగించారు. మార్గమధ్యలో రోడ్డు గుంతలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక ఆటో బోల్తా పడటం చూసి రక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గత వారం రోజులు వ్యవధిలో చాలామంది ఈ రోడ్డు పాలిటపడి క్షతగాత్రులయ్యారు. మార్గమధ్యంలో కనబడుతున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండ కట్టి తెలియజేయడం జరిగింది. ఈ పాదయాత్రలో పాలకొండ జనసేనపార్టీ నుండి ప్రశాంత్ పొరెడ్డి, పొట్నూర్ రమేష్, కడగల హరికృష్ణ, వాసు శంకర్, అఖిల్, అప్పన్న తదితర జనసైనికులు పాల్గొన్నారు.

See also  బోరుకు మరమ్మతులు చేయించిన యల్లటూరు శ్రీనివాసరాజు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి