పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి పేర్ని నానికి లేదు : లాయర్ జయరాం రెడ్డి

పవన్ కళ్యాణ్

         అనంతపురం ( జనస్వరం ) : మాజీ మంత్రి పేర్ని నానిని ఆయన కుటుంబ సభ్యులే నమ్మరు. ఇక ప్ర జలేం నమ్ము తారని… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్నోహన్‌రెడ్డి కొంచెం కొత్తగా ఆలోచించాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి సలహా ఇచ్చారు. జనసేన లీగల్‌ సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన ప్రసంగాన్ని తప్పుపడుతూ… మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేర్ని నానికి పవన్‌ కళ్యాణ్‌ ని విమర్శించే స్థాయి లేదన్నారు. చంద్రబాబుతో లాలూచీ పడి పనిచేస్తున్నది వైసిపి ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్ధమైందన్నారు. వైసిపి ప్రభుత్వానికి దమ్మధైర్యం ఉంటే సుగాలి ప్రీతి కేసును పరిష్కరించాలని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి సవాల్‌ విసిరారు. మరోసారి పవన్‌ కళ్యాణ్ ను  తప్పుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. 

See also  జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుని కలిసిన జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి