సమస్యలమీద జనసేన పోరాటం : ఎం కృష్ణాపురం జనసేన నాయకులు

జనసేన

     మాడుగుల ( జనస్వరం ) : ఎం కృష్ణాపురం పక్కన ఉన్న గ్రానైట్ క్వారీ నుంచి అధిక సంఖ్యలో లారీలు రావడం వల్ల గ్రామానికి వెళ్లే రోడ్లు చాలా పాడైపోయాయి. జనసేన పార్టీ తరఫున మాడుగుల మండల జనసైనికులు అందరూ కలిసి క్వారీ ఇంచార్జ్ రామకృష్ణ కూర్చుని దీనికోసం చర్చించి రోడ్లు వేయమని కోరారు. వర్షాకాలం వల్ల వేసిన రోడ్లు పాడుతున్నాయని శాశ్వత పరిష్కారంగా వేసవికాలంలో తారు రోడ్డు క్వారీ తరపున వేయిస్తామని అంతలోపు చిన్న చిన్న మరమతుల్ని సిమెంట్ బుగ్గు మరియు కంకర వేసి సరి చేస్తామని రైతులకు గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేం చూసుకుంటామని ఆయన జవాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం కృష్ణాపురం ప్రజలు, మాడుగుల మండల జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి నివాళులు అర్పించిన జనసేన పార్టీ వీర మహిళలు