నిరుపేదలకు చీరలు పంపిణీ చేసిన జనసేన యువనాయకుడు లోపింటి కళ్యాణ్

లోపింటి కళ్యాణ్

        విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను విజయనగరం 27వ డివిజన్ జొన్నగుడ్డి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి లోపింటి రామలక్ష్మి మరియు జనసేన యువనాయకులు లోపింటి కళ్యాణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం వైభవంగా జరిగాయి. ముందుగా ఈ వేడుకలకు ముఖ్య అతిధిలుగా విచ్చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మరియు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) కేక్ ను కట్ చేసి వేడుకల్ని ప్రారంభించారు. అనంతరం వారి చేతులమీదుగా సుమారు మూడువందలమంది నిరుపేదలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారిరువురు మాట్లాడుతూ ఇటువంటి సేవాకార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న లోపింటి కళ్యాణ్ ను అభినందిస్తూ, ప్రతీ జనసైనికులు పార్టీ బలోపేతంనకు మరింత కృషిచేయాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పిడుగు సతీష్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, బూర్లి వాసు,శ్రీనువాసు రావు, పత్రి సాయి జొన్నగుడ్డి జనసైనికులు ముక్కి కుమార్,ఆది,సురేంద్ర, రెయ్యి రాజు,బుజ్జి,మోహన్ సాయి, తదితరులు పాల్గొన్నారు.

See also  రానున్న ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి : జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్