జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఎర్రవరం గ్రామంలో పవనన్న ప్రజాబాట

     శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎర్రవరం పంచాయతీ ఎర్రవరం గ్రామలో పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేనపార్టీ సీనియర్ నాయకులు, సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి.మల్లీశ్వరావు పల్లె పల్లెకు అలుపు ఎరుగని ప్రచారం చేస్తూ జనసేన మ్యానిఫెస్టో & సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లితున్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు. రాష్ట్రంలో జాబులు కల్పించలేకపోవడం వల్ల రోజురోజుకీ నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. యువత అందరకి కూడా జాబులు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రజలకు అర్ధమైన రీతుల్లో వివరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచినట్లు అయితే సంవత్సరానికి 5గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం చేసిన రైతులకు పెన్షన్ సౌకర్యం కలదు. వృద్దులకు వృద్ధాశ్రమం నిర్మించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు కాబట్టి అలాంటి నాయకుడుని గెలుపించుకోలసిన బాధ్యత మనపైన ఉంది. అలాగే ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి గడపకి నిత్యం ప్రజల దగ్గరకి వెళ్లడం జరుగుతుంది. మేము ప్రతి గడపకు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని కలిసి ప్రజలకు అర్ధమైన రీతిలో జనసేన మేనిఫెస్టో వివరించడం జరిగింది. ఈ కార్యాక్రమంలో రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, మహాంతి రామస్వామి నాయుడు పాల్గొన్నారు. పవనన్న ప్రల్లెబాట ప్రారంభించి 95వరోజు సుదీర్ఘంగా ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి మేనిఫెస్టో గురించి వివరంగా చెప్పడం జరిగింది. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, శివ, నాగరాజు, గౌరమ్మ, వెంకటేష్, రాము, తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.

See also  ఆముదాలవలసలో జనంకోసం జనసేన కార్యక్రమం