వడిశలేరు గ్రామంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం

వడిశలేరు

             ( జనస్వరం ) : వడిశలేరు గ్రామంలో జనసేన నాయకులు బద్ది వరప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బద్ది వరప్రసాద్ మాట్లాడుతూ జనసేనపార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ” కౌలు రైతు భరోసా యాత్ర ” గురించి, జనసేన మ్యానిఫెస్టో ముద్రించి ఇంటింటికి తిరిగి ప్రజలలో అవగాహన తెలియజేస్తున్నామని అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వo రైతు వ్యతిరేక విధానాల కారణంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా నిపేందుకు రూ. 30 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిందన్నారు. ప్రతి జిల్లాలో తిరుగుతూ ఆ కుటుంబాల యోగ క్షేమాలు తెలుసుకుంటూ, ధైర్యం నింపుతూ ఒక లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తూ 3000 వేల మంది కౌలురైతుల కుటుంబాలకు అండగా పవన్ కళ్యాణ్ గారు నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  ఉపాధి కోల్పోయిన ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ సమస్యల పరిష్కారం కోసం అవనిగడ్డ జనసైనికుల శాంతియుత పాదయాత్ర